< 詩篇 140 >

1 大衛的詩,交與伶長。 耶和華啊,求你拯救我脫離凶惡的人, 保護我脫離強暴的人!
ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన యెహోవా, దుష్టుల బారి నుండి నన్ను విడిపించు. దుర్మార్గుల చేతుల్లో పడకుండా నన్ను కాపాడు.
2 他們心中圖謀奸惡, 常常聚集要爭戰。
వాళ్ళు తమ హృదయాల్లో ప్రమాదకరమైన తలంపులు పెట్టుకుంటారు. అన్నివేళలా కలహాలు పుట్టించాలని ఎదురు చూస్తుంటారు.
3 他們使舌頭尖利如蛇, 嘴裏有虺蛇的毒氣。 (細拉)
వాళ్ళు పాము నాలుకలాగా తమ నాలుకలు పదును చేసుకుంటారు. వారి పెదాల కింద పాము విషం ఉంచుకుంటారు. (సెలా)
4 耶和華啊,求你拯救我脫離惡人的手, 保護我脫離強暴的人! 他們圖謀推我跌倒。
యెహోవా, దుర్మార్గుల బారిన పడకుండా నన్ను కాపాడు. దౌర్జన్యపరుల చేతిలోనుండి నన్ను రక్షించు. నన్ను పడగొట్టడానికి వాళ్ళు పథకాలు వేస్తున్నారు.
5 驕傲人為我暗設網羅和繩索; 他們在路旁鋪下網,設下圈套。 (細拉)
గర్వాంధులు నాకోసం బోను పెట్టారు. వాళ్ళు దారి పక్కన వల పరిచారు. నన్ను బంధించడానికి ఉచ్చులు పన్నారు. (సెలా)
6 我曾對耶和華說:你是我的上帝。 耶和華啊,求你留心聽我懇求的聲音!
అయితే నేను యెహోవాతో ఇలా మనవి చేసుకుంటున్నాను, యెహోవా, నా దేవుడివి నువ్వే. నా విన్నపాలు ఆలకించు.
7 主-耶和華、我救恩的力量啊, 在爭戰的日子,你遮蔽了我的頭。
యెహోవా ప్రభూ, నువ్వే నాకు ఆశ్రయమిచ్చే కోట. యుద్ధ సమయంలో నా తలకు కాపు కాసే వాడివి నువ్వే.
8 耶和華啊,求你不要遂惡人的心願; 不要成就他們的計謀,恐怕他們自高。 (細拉)
యెహోవా, భక్తిహీనుల కోరికలను నేరవేర్చకు. వాళ్ళు మిడిసిపడకుండేలా వాళ్ళ పథకాలు భగ్నం చెయ్యి. (సెలా)
9 至於那些昂首圍困我的人, 願他們嘴唇的奸惡陷害自己!
నా చుట్టూ మూగిన వాళ్ళ తల మీదికి వాళ్ళ మాటల ద్వారా కీడు కలుగు గాక.
10 願火炭落在他們身上! 願他們被丟在火中, 拋在深坑裏,不能再起來。
౧౦కణకణలాడే నిప్పులు వాళ్ళపై కురియాలి. వాళ్ళను అగ్నిగుండంలో పడవెయ్యి. ఎన్నటికీ లేవకుండా అగాధంలో పడవెయ్యి.
11 說惡言的人在地上必堅立不住; 禍患必獵取強暴的人,將他打倒。
౧౧దూషకులకు భూమి మీద భద్రత లేకుండా పోవాలి. దుర్మార్గులను ఆపదలు వెంటాడి పడగొట్టాలి.
12 我知道耶和華必為困苦人伸冤, 必為窮乏人辨屈。
౧౨బాధితుల తరపున యెహోవా వాదిస్తాడనీ. ఆయన దరిద్రులకు న్యాయం చేకూరుస్తాడని నాకు తెలుసు.
13 義人必要稱讚你的名; 正直人必住在你面前。
౧౩నీతిపరులు నీ నామానికి కచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవర్తనులు నీ సన్నిధిలో నివసిస్తారు.

< 詩篇 140 >