< 1 Књига дневника 25 >

1 И одвоји Давид с војводама за службу синове Асафове и Еманове и Једутунове, који ће пророковати уз гусле и псалтире и кимвале; и бише између њих избројани људи за посао у својој служби:
దావీదు, మందిరం పనుల కోసం ఏర్పరచిన అధిపతులూ కలిసి, ఆసాపు, హేమాను, యెదూతూను అనేవాళ్ళ కొడుకుల్లో కొందరిని సేవ నిమిత్తం ప్రత్యేకపరచి, సితారాలను, స్వరమండలాలను, కంచు తాళాలను వాయిస్తూ ప్రవచించేలా నియమించారు. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వాళ్ళ సంఖ్య ఎంతంటే,
2 Од синова Асафових: Захур и Јосиф и Нетанија и Асарила, синови Асафови, под руком Асафа, који пророковаше по наредби царевој;
ఆసాపు కొడుకుల్లో రాజాజ్ఞప్రకారం ప్రవచిస్తూ, ఆసాపు చేతికింద ఉండేవాళ్ళు జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేలా, అనే వాళ్ళు.
3 Од Једутуна: шест синова Једутунових: Гедалија и Сорије и Јесаија, Асавија и Мататија и Симеј под руком оца свог Једутуна, који пророковаше уз гусле хвалећи и славећи Господа;
యెదూతూను సంబంధుల్లో స్తుతిపాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి తీగవాయిద్యం వాయిస్తూ ప్రవచించే తమ తండ్రి యెదూతూను చేతికింద ఉండేవాళ్ళు గెదల్యా, జెరీ, యెషయా, హషబ్యా, మత్తిత్యా అనే ఆరుగురు.
4 Од Емана: синови Еманови: Вукија, Матанија, Озило, Севуило и Јеримот, Ананија и Ананије, Елијата, Гидалтија и Ромамти-Езер, Јосвекаса, Малотије, Отир и Мазиот.
హేమాను సంబంధుల్లో హేమాను కొడుకులు బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయ్యాతా, గిద్దల్తీ, రోమమ్తియెజెరు, యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు అనేవాళ్ళు.
5 Ти сви беху синови Емана видеоца царевог у речима Божијим да се узвишује рог; јер Бог даде Еману четрнаест синова и три кћери.
వీళ్ళందరూ దేవుని వాక్కు విషయంలో రాజుకు ప్రవక్త అయిన హేమాను కొడుకులు. హేమానును గొప్ప చెయ్యడానికి దేవుడు హేమానుకు పద్నాలుగు మంది కొడుకులను, ముగ్గురు కూతుళ్ళను అనుగ్రహించాడు.
6 Сви они беху под руком оца свог певајући у дому Господњем уз кимвале и псалтире и гусле, за службу у дому Божијем, како цар наређиваше Асафу и Једутуну и Еману.
వీళ్ళందరూ ఆసాపుకూ, యెదూతూనుకూ, హేమానుకూ, రాజు చేసిన కట్టడ ప్రకారం యెహోవా ఇంట్లో తాళాలు, స్వరమండలాలు, తీగ వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, తమ తండ్రి చేతి కింద దేవుని మందిరం సేవ జరిగిస్తూ ఉన్నారు.
7 И беше их на број с браћом њиховом обученом песмама Господњим, двеста и осамдесет и осам, самих вештака.
యెహోవాకు పాటలు పాడడంలో నేర్పు గల తమ సహోదరులతో పాటు ఉన్న ప్రవీణులైన వాద్యకారుల లెక్క రెండు వందల ఎనభై ఎనిమిది.
8 И бацише жреб за службу своју, мали као велики, учитељ као ученик;
తాము చేసే సేవ విషయంలో చిన్న అనీ, పెద్ద అనీ, గురువనీ శిష్యుడనీ భేదం లేకుండా వంతుల కోసం చీట్లు వేశారు.
9 И паде први жреб за Асафа на Јосифа, други на Гедалију с браћом и синовима његовим, њих дванаест;
మొదటి చీటి ఆసాపు వంశంలో ఉన్న యోసేపు పేరట పడింది, రెండోది గెదల్యా పేరట పడింది. ఇతనూ, ఇతని సహోదరులూ కొడుకులూ పన్నెండుమంది.
10 Трећи на Захура, синове његове и браћу његову, њих дванаест;
౧౦మూడోది జక్కూరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండుమంది.
11 Четврти на Исерија, синове његове и браћу његову, њих дванаест;
౧౧నాలుగోది యిజ్రీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండుమంది.
12 Пети на Нетанију, синове његове и браћу његову, њих дванаест;
౧౨అయిదోది నెతన్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
13 Шести на Вукију, синове његове и браћу његову, њих дванаест;
౧౩ఆరోది బక్కీయాహు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
14 Седми на Јесарилу, синове његове и браћу његову, њих дванаест;
౧౪ఏడోది యెషర్యేలా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
15 Осми на Јесаију, синове његове и браћу његову, њих дванаест;
౧౫ఎనిమిదోది యెషయా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
16 Девети на Матанију, синове његове и браћу његову, њих дванаест;
౧౬తొమ్మిదోది మత్తన్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
17 Десети на Симеја, синове његове и браћу његову, њих дванаест;
౧౭పదోది షిమీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
18 Једанаести на Азареила, синове његове и браћу његову, њих дванаест;
౧౮పదకొండోది అజరేలు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
19 Дванаести на Асавију, синове његове и браћу његову, њих дванаест;
౧౯పన్నెండోది హషబ్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
20 Тринаести на Савуила, синове његове и браћу његову, њих дванаест;
౨౦పదమూడోది షూబాయేలు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
21 Четрнаести на Мататију, синове његове и браћу његову, њих дванаест;
౨౧పదునాలుగోది మత్తిత్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
22 Петнаести на Јеремота, синове његове и браћу његову, њих дванаест;
౨౨పదిహేనోది యెరేమోతు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
23 Шеснаести на Ананију, синове његове и браћу његову, њих дванаест;
౨౩పదహారోది హనన్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
24 Седамнаести на Јосвекасу, синове његове и браћу његову, њих дванаест;
౨౪పదిహేడోది యొష్బెకాషా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
25 Осамнаести на Ананија, синове његове и браћу његову, њих дванаест;
౨౫పద్దెనిమిదోది హనానీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
26 Деветнаести на Малотија, синове његове и браћу његову, њих дванаест;
౨౬పందొమ్మిదవది మల్లోతి పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
27 Двадесети на Елијату, синове његове и браћу његову, њих дванаест;
౨౭ఇరవయ్యోది ఎలీయ్యాతా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
28 Двадесет први на Отира, синове његове и браћу његову, њих дванаест;
౨౮ఇరవై ఒకటోది హోతీరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
29 Двадесет други на Гидалтију, синове његове и браћу његову, њих дванаест;
౨౯ఇరవై రెండోది గిద్దల్తీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
30 Двадесет трећи на Мазиота, синове његове и браћу његову, њих дванаест;
౩౦ఇరవై మూడోది మహజీయోతు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
31 Двадесет четврти на Ромамти-Езера, синове његове и браћу његову, њих дванаест;
౩౧ఇరవై నాలుగోది రోమమ్తీయెజెరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

< 1 Књига дневника 25 >