< 1 Књига Самуилова 17 >

1 Тада Филистеји скупише војску своју да војују, и скупише се у Сокоту Јудином, и стадоше у логор између Сокота и Азике на међи дамимској.
ఫిలిష్తీయులు యూదా ప్రదేశంలో తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చారు. శోకోలో సమకూడి ఏఫెస్దమ్మీము దగ్గర శోకో, అజేకా మధ్య మకాం చేశారు.
2 А Саул и Израиљци скупише се и стадоше у логор у долини Или, и уврсташе се према Филистејима.
సౌలు, ఇశ్రాయేలీయులు కూడుకుని ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులను ఎదిరించడానికి వరుసల్లో నిలబడ్డారు.
3 И Филистеји стајаху на брду одонуда а Израиљци стајаху на брду одовуда, а међу њима беше долина.
ఒక లోయకు ఇరుప్రక్కలా కొండల మీద ఫిలిష్తీయులు, ఇశ్రాయేలీయులు నిలిచి ఉన్నారు.
4 И изађе из логора филистејског један заточник по имену Голијат из Гата, висок шест лаката и пед.
ఫిలిష్తీయుల సైన్యంలోనుండి గొల్యాతు అనే బలశాలి బయలుదేరాడు. అతడు గాతు ప్రాంతానికి చెందినవాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జానెడు.
5 И на глави му беше капа од бронзе, и оклоп плочаст на њему од бронзе; и беше оклоп тежак пет хиљада сикала.
అతడు తన తలపై కంచు శిరస్త్రాణం ధరించాడు. అతడు యుద్ధ కవచం పెట్టుకున్నాడు. కవచం బరువు 57 కిలోలు.
6 И ногавице од бронзе беху му на ногама, и штит од бронзе на раменима.
అతని కాళ్లకు కంచు కవచం, అతని భుజాల మధ్య ఒక కంచు బల్లెం ఉన్నాయి.
7 А копљача од копља му беше као вратило, а гвожђа у копљу му беше шест стотина сикала; и који му оружје ношаше иђаше пред њим.
అతని చేతిలోని ఈటె, చేనేత పనివాడి అడ్డకర్ర అంతపెద్దది. ఈటె కొన బరువు 7 కిలోల ఇనుమంత బరువు. ఒక సైనికుడు బల్లెం మోస్తూ గొల్యాతు ముందు నడుస్తున్నాడు.
8 Он ставши викаше војску израиљску, и говораше им: Што сте изашли уврставши се? Нисам ли ја Филистејин а ви слуге Саулове? Изберите једног између себе, па нека изађе к мени.
అతడు నిలబడి ఇశ్రాయేలీయుల సైన్యం వారితో “నేను ఫిలిష్తీయుణ్ణి, మీరంతా సౌలు దాసులు కదా. యుద్ధం చేయడానికి మీరంతా ఎందుకు వస్తున్నారు? మీరు మీ తరఫున ఒకరిని ఎన్నుకుని అతణ్ణి నాపైకి యుద్ధానికి పంపండి.
9 Ако ме надјача и погуби ме, ми ћемо вам бити слуге; ако ли ја њега надјачам и погубим га, онда ћете ви бити нама слуге, и служићете нам.
అతడు నాతో పోరాడి నన్ను చంపగలిగితే మేమంతా మీకు దాసోహం అవుతాం. నేనే గనక అతణ్ణి జయించి, అతణ్ణి చంపితే మీరంతా మాకు దాస్యం చేయాలి.”
10 Још говораше Филистејин: Ја осрамотих данас војску израиљску: дајте ми човека да се бијемо.
౧౦ఆ ఫిలిష్తీయుడు ఇంకా ఇలా అన్నాడు. “ఈ రోజున నేను ఇశ్రాయేలీయుల సైన్న్యాన్ని సవాలు చేస్తున్నాను. మీ నుండి ఒకరిని పంపితే వాడూ నేనూ పోరాడతాం” అంటూ రంకెలు వేశాడు.
11 А кад Саул и сав Израиљ чу шта рече Филистејин, препадоше се и уплашише се врло.
౧౧సౌలు, ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని కేకలు విని హడలిపోయి చాలా భయపడి పోయారు.
12 А беше Давид син једног Ефраћанина, из Витлејема Јудиног, коме име беше Јесеј, који имаше осам синова и беше у време Саулово стар и временит међу људима.
౧౨దావీదు యూదా దేశపు బేత్లెహేమువాడు, ఎఫ్రాతీయుడైన యెష్షయి కొడుకు. యెష్షయికి ఎనిమిదిమంది కొడుకులు. అతడు సౌలు కాలంలో ముసలివాడై బలహీనంగా ఉన్నాడు.
13 И три најстарија сина Јесејева отидоше за Саулом на војску; а имена тројици синова његових који отидоше на војску беху првенцу Елијав а другом Авинадав а трећем Сама.
౧౩యెష్షయి ముగ్గురు పెద్ద కొడుకులు సౌలుతోపాటు యుద్ధానికి వెళ్లారు. యుద్ధానికి వెళ్ళిన అతని ముగ్గురు కొడుకుల్లో మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా.
14 А Давид беше најмлађи. И она три најстарија отидоше за Саулом.
౧౪దావీదు ఆఖరి కొడుకు. అన్నలు ముగ్గురూ సౌలుతోబాటు వెళ్లారు కాని
15 А Давид отиде од Саула и врати се у Витлејем да пасе овце оца свог.
౧౫దావీదు బేత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుతూ, సౌలు దగ్గరకు వెళ్ళి వస్తూ ఉన్నాడు.
16 А Филистејин излажаше јутром и вечером, и стаја четрдесет дана.
౧౬ఆ ఫిలిష్తీయుడు నలభై రోజులు ప్రతి ఉదయం సాయంత్రం లోయలోకి వచ్చి నిలబడేవాడు.
17 А Јесеј рече Давиду, сину свом: Узми сада за браћу своју ефу овог прженог жита и ових десет хлебова, и однеси брже у логор браћи својој.
౧౭యెష్షయి తన కొడుకు దావీదును పిలిచి “ఒక తూముడు వేయించిన గోదుమలనూ పది రొట్టెలనూ తీసుకు సైన్యంలో ఉన్న నీ అన్నల కోసం తొందరగా వెళ్ళు.
18 А ових десет младих сираца однеси хиљаднику, и види браћу своју како су, и донеси од њих знак.
౧౮ఇంకా ఈ పది జున్నుగడ్డలు తీసికువెళ్ళి వారి సహస్రాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమసమాచారం తెలుసుకుని వారి దగ్గరనుండి ఏదైనా గుర్తు తీసుకురా” అని చెప్పి పంపించాడు.
19 А Саул и они и сав Израиљ беху у долини Или ратујући с Филистејима.
౧౯సౌలు సైన్యం, ఇశ్రాయేలీయులంతా ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు.
20 И тако Давид уста рано и остави овце на чувару; па узе и отиде како му заповеди Јесеј; и дође на место где беше логор, и војска излажаше да се врста за бој, и подизаше убојну вику.
౨౦దావీదు ఉదయాన్నే లేచి మరో కాపరికి తన గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకు యెష్షయి ఆజ్ఞాపించినట్టు ప్రయాణమయ్యాడు. అతడు యుద్ధ శిబిరం చేరే సమయానికి సైన్యాలు బారులుతీరి నినాదాలు చేస్తూ యుద్ధరంగానికి చేరుకొంటున్నారు.
21 И стајаше војска израиљска и филистејска једна према другој.
౨౧ఇశ్రాయేలువారు, ఫిలిష్తీయవారు ఎదురెదురుగా నిలిచి యుద్ధానికి సిద్ధపడుతున్నారు.
22 Тада остави Давид свој пртљаг код чувара који чуваше пртљаг и отрча у војску, и дође и запита браћу своју за здравље.
౨౨దావీదు తాను తెచ్చిన వస్తువులను సామానులు భద్రపరచే వాని దగ్గర ఉంచి, పరిగెత్తుకుంటూ సైన్యంలో చొరబడి తన అన్నలను కుశల ప్రశ్నలడిగాడు.
23 И докле говораше с њима, гле, онај заточник по имену Голијат Филистејин из Гата, изађе из војске филистејске и говораше као пре, и Давид чу.
౨౩అతడు వారితో మాట్లాడుతున్నప్పుడు గాతు పట్టణపు ఫిలిష్తీయ బలశాలి, గొల్యాతు ఫిలిష్తీయుల సైన్యంలోనుండి వచ్చి పైన పలికిన మాటల్నే చెప్పడం దావీదు విన్నాడు.
24 А сви Израиљци кад видеше тог човека, узбегоше од њега, и беше их страх веома.
౨౪ఇశ్రాయేలీ సైనికులు అతణ్ణి చూసి ఎంతో భయపడి అతని దగ్గర నుండి పారిపోయారు.
25 И говораху Израиљци: Видесте ли тог човека што изађе? Јер изађе да срамоти Израиља. А ко би га погубио, цар би му дао силно благо, и кћер своју дао би му; и ослободио би дом оца његовог у Израиљу.
౨౫ఇశ్రాయేలీయులు “ముందుకు వస్తున్న అతణ్ణి చూశారా, కచ్చితంగా ఇశ్రాయేలీయులను ఎదిరించడానికి వాడు బయలుదేరాడు. వాణ్ణి చంపినవాడికి రాజు చాలా డబ్బులిచ్చి, కూతురినిచ్చి పెళ్లిచేసి, అతణ్ణి, అతని కుటుంబాన్ని పన్ను కట్టే బాధ్యత నుండి మినహాయిస్తాడు” అని చెప్పాడు.
26 Тада рече Давид људима који стајаху око њега говорећи: Шта ће се учинити човеку који погуби тог Филистејина и скине срамоту с Израиља? Јер ко је тај Филистејин необрезани да срамоти војску Бога Живог?
౨౬అప్పుడు దావీదు “సజీవుడైన దేవుని సైన్యాలను ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయునికి ఎంత ధైర్యం?” వాణ్ణి చంపి ఇశ్రాయేలీయులకు వచ్చిన ఈ అపవాదును తీసివేసిన వాడికి వచ్చే బహుమతి ఏమిటి అని తన దగ్గర నిలబడినవాళ్ళని అడిగితే,
27 А народ му одговори исте речи говорећи: То ће се учинити ономе ко га погуби.
౨౭వారు, వాణ్ణి చంపినవాడికి లభించే కానుకల గురించి చెప్పారు.
28 А кад чу Елијав брат његов најстарији како се разговара с тим људима, разљути се Елијав на Давида, и рече му: Што си дошао? И на коме си оставио оно мало оваца у пустињи? Знам ја обест твоју и злоћу срца твог; дошао си да видиш бој.
౨౮దావీదు వారితో మాట్లాడుతున్న విషయాలు, అతని పెద్దన్న ఏలీయాబు విన్నాడు. అతడు దావీదు మీద కోపపడి “నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? అడవిలో ఆ చిన్న గొర్రెల మందను ఎవరికి అప్పగించావు? నీ గర్వం, నీలోని చెడుతనం నాకు తెలుసు. యుద్ధం చూడడానికే నువ్వు వచ్చావు కదా?” అన్నాడు.
29 А Давид рече: Шта сам сад учинио? Заповеђено ми је.
౨౯దావీదు “నేనేం చేశాను? ఊరికే అడుగుతున్నాను” అని చెప్పి
30 Потом окрену се од њега к другом и запита као пре; и народ му одговори као пре.
౩౦అక్కడ నుండి మరో వ్యక్తిని ఆలానే అడిగాడు. మళ్ళీ అదే జవాబు వచ్చింది.
31 И кад чуше речи које говораше Давид, јавише их Саулу, а он га дозва к себи.
౩౧దావీదు అడుగుతున్న మాటలు కొందరికి తెలిసినప్పుడు వారు ఆ సంగతి సౌలుతో చెబితే సౌలు దావీదును పిలిపించాడు.
32 И Давид рече Саулу: Нека се нико не плаши од оног; слуга ће твој изаћи и биће се с Филистејином.
౩౨దావీదు సౌలుతో “ఈ ఫిలిష్తీయుడి విషయంలో ఎవరూ ఆందోళన పడనక్కరలేదు. మీ సేవకుడనైన నేను వాడితో యుద్ధం చేస్తాను” అన్నాడు.
33 А Саул рече Давиду: Не можеш ти ићи на Филистејина да се бијеш с њим, јер си ти дете а он је војник од младости своје.
౩౩సౌలు “ఈ ఫిలిష్తీయునితో యుద్ధం చేయడానికి నీకు బలం చాలదు. నువ్వు చిన్న పిల్లవాడివి. వాడు చిన్నప్పటినుండి యుద్దాలు చేస్తూ ఉన్నాడు” అని దావీదుతో అన్నాడు.
34 А Давид рече Саулу: Слуга је твој пасао овце оца свог; па кад дође лав или медвед и однесе овцу из стада,
౩౪అందుకు దావీదు సౌలుతో “నీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి అయినా, సింహమైనా వచ్చి మందలోనుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతే
35 Ја потрчах за њим, и ударих га и отех му из чељусти; и кад би скочио на ме; ухватих га за грло, те га бих и убих.
౩౫నేను దాన్ని వెంటాడి చంపి దాని నోట్లో నుండి ఆ గొర్రెపిల్లను విడిపించాను. అది నాపైకి వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను.
36 И лава и медведа убијао је твој слуга, па ће и тај Филистејин необрезани проћи као они; јер осрамоти војску Бога Живог.
౩౬నీ సేవకుడనైన నేను సింహాన్నీ ఎలుగుబంటినీ చంపాను. సజీవుడైన దేవుని సైన్యాన్ని దూషించిన ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు కూడా వాటిలో ఒకదానిలాగా అవుతాడు.
37 Још рече Давид: Господ који ме је сачувао од лава и медведа, Он ће ме сачувати и од овог Филистејина. Тада рече Саул Давиду: Иди, и Господ нека буде с тобом.
౩౭సింహం, ఎలుగుబంటి బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడా నన్ను విడిపిస్తాడు” అని చెప్పాడు. సౌలు “యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక, వెళ్ళు” అని దావీదుతో అన్నాడు.
38 И Саул даде Давиду своје оружје, и метну му на главу капу своју од бронзе и метну оклоп на њ.
౩౮అప్పుడు సౌలు తన యుద్ధ వస్త్రాలను దావీదుకు తొడిగించాడు. ఒక కంచు శిరస్త్రాణం అతనికి పెట్టి, యుద్ధ కవచం తొడిగించాడు.
39 И припаса Давид мач његов преко свог одела и пође, али не беше навикао, па рече Давид Саулу: Не могу ићи с тим, јер нисам навикао. Па скиде Давид са себе.
౩౯దావీదు తన యుద్ధ కవచం మీద తన కత్తి కట్టుకున్నాడు. అయితే అవి అతనికి అలవాటు లేవు గనక నడవలేకపోయాడు. అప్పుడు దావీదు “ఇవి నాకు అలవాటు లేదు, వీటితో నేను యుద్ధానికి వెళ్లలేను” అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు.
40 И узе штап свој у руку, и изабра на потоку пет глатких камена и метну их у торбу пастирску, коју имаше, и узе праћу своју у руку, и тако пође ка Филистејину.
౪౦తన చేతికర్ర పట్టుకుని వాగులోనుండి ఐదు నున్నని రాళ్లు ఏరుకుని తన దగ్గర ఉన్న వడిసెల పట్టుకుని ఆ ఫిలిష్తీయునికి దగ్గరగా వెళ్ళాడు.
41 А и Филистејин иђаше све ближе к Давиду, а човек који му ношаше оружје, иђаше пред њим.
౪౧బల్లెం మోసేవాడు తనకు ముందుగా నడుస్తుంటే, ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి
42 А кад Филистејин погледа и виде Давида, подсмехну му се, што беше млад и смеђ и лепог лица.
౪౨చుట్టూ తేరి చూసి, ఎర్రనివాడు, అందగాడు, బాలుడు అయిన దావీదును నిర్లక్ష్యంగా చూశాడు.
43 И рече Филистејин Давиду: Еда ли сам псето, те идеш на ме са штапом? И проклињаше Филистејин Давида боговима својим.
౪౩ఫిలిష్తీయుడు “కర్ర తీసుకు నువ్వు నా మీదికి వస్తున్నావే, నేనేమైనా కుక్కనా?” అని చెప్పి తమ దేవుళ్ళ పేరున దావీదును శపించాడు.
44 И рече Филистејин Давиду: Ходи к мени да дам тело твоје птицама небеским и зверима земаљским.
౪౪“నా దగ్గరికి రా, నిన్ను చంపి నీ మాంసాన్ని పక్షులకు, జంతువులకు వేస్తాను” అని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అన్నప్పుడు,
45 А Давид рече Филистејину: Ти идеш на ме с мачем и с копљем и са штитом; а ја идем на те у име Господа над војскама, Бога војске Израиљеве, ког си ружио.
౪౫దావీదు “నువ్వు కత్తి, ఈటె, బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు. నేనైతే నువ్వు దూషిస్తున్న ఇశ్రాయేలీయుల సేనల అధిపతి యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను.
46 Данас ће те Господ дати мени у руке, и убићу те, и скинућу главу с тебе, и даћу данас телеса војске филистејске птицама небеским и зверима земаљским, и познаће сва земља да је Бог у Израиљу.
౪౬ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను చంపి నీ తల తీసేస్తాను. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నాడని లోకంలోని వారంతా తెలుసుకొనేలా నేను ఈ రోజున ఫిలిష్తీయుల శవాలను పక్షులకు, జంతువులకు వేస్తాను.
47 И знаће сав овај збор да Господ не спасава мачем ни копљем, јер је рат Господњи, зато ће вас дати нама у руке.
౪౭అప్పుడు యెహోవా కత్తిచేత, ఈటెచేత రక్షించేవాడు కాదని ఇక్కడ ఉన్నవారంతా తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాయే చేస్తాడు. ఆయన మిమ్మల్ని మాకు అప్పగిస్తాడు” అని చెప్పాడు.
48 А кад се Филистејин подиже и дође ближе к Давиду, Давид брже истрча на бојиште пред Филистејина.
౪౮ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును ఎదుర్కోవడానికి ముందుకు కదిలాడు. దావీదు, సైన్యం ఉన్న వైపుకు వేగంగా పరిగెత్తి వెళ్ళి
49 И Давид тури руку своју у торбу своју, и извади из ње камен, и баци га из праће, и погоди Филистејина у чело и уђе му камен у чело, те паде ничице на земљу.
౪౯తన సంచిలో చెయ్యి పెట్టి అందులోనుండి ఒక రాయి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదురుపై తగిలేలా కొట్టాడు. ఆ రాయి వాడి నుదురులోకి దూసుకు పోయింది. వాడు నేలపై బోర్లా పడిపోయాడు.
50 Тако Давид праћом и каменом надјача Филистејина, и удари Филистејина и уби га; а немаше Давид мача у руци.
౫౦ఆ విధంగా దావీదు వడిసెలతో, రాయితో ఫిలిష్తీయుణ్ణి ఓడించాడు. అతడు ఆ ఫిలిష్తీయుణ్ణి కొట్టి చంపాడు. అతని చేతిలో కత్తి లేదు.
51 И притрчавши Давид стаде на Филистејина, и зграби мач његов и извуче га из корица и погуби га и одсече му главу. А Филистеји кад видеше где погибе јунак њихов побегоше.
౫౧దావీదు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఫిలిష్తీయుని మీద నిలబడి వాడి వరలోని కత్తి దూసి దానితో వాడిని చంపి, తల తెగగొట్టాడు. ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి అంతా పారిపోయారు.
52 А Израиљци и Јудејци усташе и повикаше и потераше Филистеје до долине и до врата акаронских; и падаше побијени Филистеји по путу сарајимском до Гата и до Акарона.
౫౨అప్పుడు ఇశ్రాయేలువారు, యూదావారు లేచి, హర్షధ్వానాలు చేస్తూ బయలుదేరి లోయ ప్రదేశం వరకూ, ఎక్రోను ద్వారాల వరకూ ఫిలిష్తీయులను తరిమారు. చచ్చిన ఫిలిష్తీయులు షరాయిం దారి పొడవునా గాతు, ఎక్రోను పట్టణాల వరకూ కూలిపోయారు.
53 Потом се вратише синови Израиљеви теравши Филистеје, и опленише логор њихов.
౫౩తరువాత ఇశ్రాయేలువారు ఫిలిష్తీయులను తరమడం ఆపి తిరిగి వచ్చి వారి డేరాల్లో ఉన్నదంతా దోచుకున్నారు.
54 А Давид узе главу Филистејинову, и однесе је у Јерусалим, а оружје његово остави у својој колиби.
౫౪అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధాలను తన డేరాలో ఉంచుకుని, అతని తలను తీసుకు యెరూషలేముకు వచ్చాడు.
55 А кад Саул виде Давида где иде пред Филистејина, рече Авениру војводи: Чији је син тај младић, Авенире? А Авенир рече: Како је жива душа твоја царе, не знам.
౫౫దావీదు ఫిలిష్తీయుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళడం చూసి సౌలు తన సైన్యాధిపతి అబ్నేరును పిలిచి “అబ్నేరూ, ఈ కుర్రవాడు ఎవరి కొడుకు?” అని అడిగినప్పుడు, అబ్నేరు “రాజా, నీమీద ఒట్టు. అతడెవరో నాకు తెలియదు” అన్నాడు.
56 А цар рече: Питај чији је син тај младић.
౫౬అప్పుడు రాజు “ఈ కుర్రవాడు ఎవరి కొడుకో అడిగి తెలుసుకో” అని ఆజ్ఞాపించాడు.
57 А кад се врати Давид погубивши Филистејина, узе га Авенир и изведе га пред Саула, а у руци му беше глава Филистејинова.
౫౭ఫిలిష్తీయుని చంపి తిరిగి వస్తున్న దావీదును అబ్నేరు ఎదుర్కొని ఫిలిష్తీయుని తల, దావీదు చేతిలో ఉండగానే సౌలు దగ్గరికి తీసుకువచ్చాడు.
58 И Саул рече му: Чији си син, дете? А Давид рече: Ја сам син слуге твог Јесеја Витлејемца.
౫౮సౌలు అతనితో “అబ్బాయ్! మీ నాన్న ఎవరు?” అని అడిగినప్పుడు దావీదు “నేను నీ దాసుడు, బేత్లెహేము ఊరి వాడైన యెష్షయి కొడుకుని” అని జవాబిచ్చాడు.

< 1 Књига Самуилова 17 >