< Књига проповедникова 2 >

1 Ја рекох у срцу свом: Дај да те окушам весељем; уживај добра. Али гле и то беше таштина.
“అప్పుడు, నిన్ను సంతోషం చేత పరీక్షిస్తాను, నువ్వు మేలును రుచి చూడు” అని నేను నా హృదయంతో చెప్పుకున్నాను. అయితే అది కూడా వ్యర్థప్రయత్నమే అయ్యింది.
2 Смеху рекох: Лудујеш; и весељу: Шта то радиш?
నవ్వుతో, నువ్వు వెర్రిదానివి అనీ సంతోషంతో, నీవలన లాభం లేదు అనీ అన్నాను.
3 Размишљах у срцу свом да пуштам тело своје на пиће, и срцем својим управљајући мудро да се држим лудости докле не видим шта би добро било синовима људским да чине под небом док су живи.
నా మనస్సు ఇంకా జ్ఞానాన్ని కోరుకుంటుండగా ఆకాశం కింద మానవులు తమ జీవితంలో ఏమి చేస్తే మేలు పొందుతారో చూద్దామని, ద్రాక్షారసంతో నా శరీరాన్ని సంతోషపరచుకొంటాను, బుద్ధిహీనత వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని ఆలోచించాను.
4 Велика дела учиних: сазидах себи куће, насадих себи винограде;
నేను గొప్ప గొప్ప పనులు చేశాను. నా కోసం ఇళ్ళు కట్టించుకున్నాను, ద్రాక్షతోటలు నాటించుకున్నాను.
5 Начиних себи вртове и воћњаке, и насадих у њима свакојаких дрвета родних;
తోటలు, ఉద్యానవనాలను వేయించి వాటిలో పలు రకాల పండ్ల చెట్లు నాటించాను.
6 Начиних себи језера водена да заливам из њих шуму где расту дрвета;
ఆ చెట్లకు నీటి కోసం నేను చెరువులు తవ్వించాను.
7 Набавих себи слуга и слушкиња, и имах слуга рођених у кући мојој; и имах говеда и оваца више од свих који бише пре мене у Јерусалиму;
ఆడ, మగ పనివారిని నియమించుకున్నాను. దాసులుగానే నా ఇంట్లో పుట్టినవారు నాకు ఉన్నారు. యెరూషలేములో నాకు ముందు ఉన్న వారందరికంటే ఎక్కువగా పశువులు, గొర్రె మేకల మందలు నేను సంపాదించుకున్నాను.
8 Такође накупих себи сребра и злата и заклада од царева и земаља; набавих себи певача и певачица и милина људских, и справа музичких свакојаких.
నా కోసం వెండి బంగారాలను, వివిధ దేశాల రాజులకు, సంస్థానాల అధిపతులకు ఉండేటంత సంపదను సమకూర్చుకున్నాను. గాయకులనూ గాయకురాళ్ళనీ, మనుషులు కోరేవాటన్నిటినీ సంపాదించుకుని అనేకమంది స్త్రీలనూ ఉంచుకున్నాను.
9 И тако постах већи и силнији од свих који бише пре мене у Јерусалиму; и мудрост моја оста са мном.
నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటే గొప్పవాణ్ణి, ఆస్తిపరుణ్ణి అయ్యాను. నా జ్ఞానం నన్ను నడిపిస్తూనే ఉంది.
10 И шта год жељаху очи моје, не брањах им нити ускраћивах срцу свом какво весеље, него се срце моје весељаше са сваког труда мог, и то ми беше део од сваког труда мог.
౧౦నా కళ్ళు చూడాలని ఆశపడిన వాటిని చూడకుండా నేను అడ్డు చెప్పలేదు. నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషించింది. అందుకే సంతోషాలను అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం.
11 А кад погледах на сва дела своја што урадише руке моје, и на труд којим се трудих да урадим, гле, све беше таштина и мука духу, и нема користи под сунцем.
౧౧అప్పుడు నేను చేసిన పనులన్నిటినీ, వాటి కోసం నేను పడిన బాధ అంతటినీ గమనించి చూస్తే అవన్నీ నిష్ప్రయోజనంగా, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా కనిపించింది. సూర్యుని కింద ప్రయోజనకరమైనది ఏదీ లేనట్టు నాకు కనిపించింది.
12 Тада се обратих да видим мудрост и лудост и безумље, јер шта би чинио човек који би настао после цара? Шта је већ учињено.
౧౨తరువాత రాబోయే రాజు, ఇప్పటిదాకా జరిగిన దానికంటే ఎక్కువ ఏం చేయగలడు? అనుకుని, నేను జ్ఞానాన్ని, వెర్రితనాన్ని, బుద్ధిహీనతను గురించి ఆలోచించడం ప్రారంభించాను.
13 И видех да је боља мудрост од лудости, као што је боља светлост од мрака.
౧౩అప్పుడు చీకటి కంటే వెలుగెంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరం అని నేను తెలుసుకున్నాను.
14 Мудри има очи у глави, а безумни иде по мраку; али такође дознах да једнако бива свима.
౧౪జ్ఞాని కళ్ళు అతని తలలో ఉన్నాయి. బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడు. అయినా అందరి గమ్యం ఒక్కటే అని నేను గ్రహించాను.
15 Зато рекох у срцу свом: Мени ће бити као безумнику што бива; шта ће ми дакле помоћи што сам мудар? И рекох у срцу свом: и то је таштина.
౧౫కాబట్టి బుద్ధిహీనుడికి జరిగేదే నాకూ జరుగుతుంది, మరి నేను ఇంత జ్ఞానం ఎందుకు సంపాదించాను అని నా హృదయంలో అనుకున్నాను. కాబట్టి ఇదీ నిష్ప్రయోజనమే.
16 Јер се неће спомињати мудрац као ни безумник до века; јер што сада јесте, све се заборавља после, и мудрац умире као и безумник.
౧౬బుద్ధిహీనులకు జరిగినట్టే జ్ఞానులను కూడా ఎవరూ జ్ఞాపకం ఉంచుకోరు. రాబోయే రోజుల్లో వారందరినీ మర్చిపోతారు. బుద్ధిహీనుడు ఎలా చనిపోతాడో, జ్ఞాని కూడా అలాగే చనిపోతాడు.
17 Зато ми омрзе живот, јер ми није мило шта бива под сунцем, јер је све таштина и мука духу.
౧౭ఇదంతా చూస్తే సూర్యుని కింద జరిగేదంతా నన్ను కుంగదీసింది. అంతా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి బాధ పడినట్టుగా కనిపించింది. నాకు జీవితం మీద అసహ్యం వేసింది.
18 И омрзе ми сав труд мој око ког се трудих под сунцем, јер ћу га оставити човеку који ће настати након мене.
౧౮సూర్యుని కింద నేను ఎంతో బాధపడి సాధించిన వాటన్నిటినీ నా తరవాత వచ్చేవాడికి విడిచిపెట్టాలని గ్రహించి నేను వాటిని అసహ్యించుకున్నాను.
19 И ко зна хоће ли бити мудар или луд? И опет ће бити господар од свега труда мог око ког се трудих и мудровах под сунцем. И то је таштина.
౧౯వాడు తెలివైనవాడో, బుద్ధిహీనుడో ఎవరికి తెలుసు? అయితే సూర్యుని కింద నేను బాధతో, జ్ఞానంతో సంపాదించినదంతా వాడి అధికారం కిందకు వెళ్తుంది. ఇదీ నిష్ప్రయోజనమే.
20 Зато дођох на то да ми срце изгуби надање о сваком труду око ког се трудих под сунцем.
౨౦కాబట్టి సూర్యుని కింద నేను పడిన కష్టమంతటి విషయంలో నేను నిస్పృహ చెందాను.
21 Јер има људи који се труде мудро и разумно и право, па то остављају у део другом који се није трудио око тога. И то је таштина и велико зло.
౨౧ఒకడు జ్ఞానంతో, తెలివితో, నైపుణ్యంతో కష్టపడి ఒక పని చేస్తాడు. అయితే అతడు దాని కోసం పని చేయని వేరొకడికి దాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తున్నది. ఇది కూడా నిష్ప్రయోజనంగా, గొప్ప విషాదంగా ఉంది.
22 Јер шта има човек од свега труда свог и од муке срца свог, коју подноси под сунцем?
౨౨సూర్యుని కింద మానవుడు పడే కష్టానికీ చేసే పనులకూ అతడికేం దొరుకుతున్నది?
23 Јер су сви дани његови мука, а послови његови брига; ни ноћу се не одмара срце његово. И то је таштина.
౨౩అతడు రోజులో చేసే పనులన్నీ కష్టంతో, వత్తిడితో నిండి ఉన్నాయి. కాబట్టి రాత్రి పూట కూడా అతడి మనస్సుకు నెమ్మది దొరకదు. ఇది కూడా నిష్ప్రయోజనమే.
24 Није ли, дакле, добро човеку да једе и пије и да гледа да му је души добро од труда његовог? Ја видех и то да је из руке Божије.
౨౪అన్నపానాలు పుచ్చుకోవడం కంటే, తన కష్టంతో సంపాదించిన దానితో తృప్తి చెందడం కంటే మానవునికి శ్రేష్టమైంది లేదు. అది దేవుని వల్లనే కలుగుతుందని నేను గ్రహించాను.
25 Јер ко је јео и уживао више него ја?
౨౫ఆయన అనుమతి లేకుండా భోజనం చేయడం, సంతోషించడం ఎవరికి సాధ్యం?
26 Јер човеку који Му је по вољи даје мудрост и разум и радост, а грешнику даје муку да сабира и скупља да да ономе који је по вољи Богу. И то је таштина и мука духу.
౨౬ఎందుకంటే ఎవరైతే దేవుణ్ణి సంతోషింప జేస్తారో వాడికి దేవుడు జ్ఞానం, తెలివి, ఆనందం ఇస్తాడు. అయితే తనకిష్టమైన వాడికి ఇవ్వడానికి కష్టపడి పోగుచేసే పనిని ఆయన పాపాత్మునికి అప్పగిస్తాడు. ఇది కూడా నిష్ప్రయోజనం, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా ఉంది.

< Књига проповедникова 2 >